Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ల‌క్ష‌లాది మంది తోబుట్టువుల‌ను దేవుడిచ్చాడు: నారా లోకేశ్

Nara Lokesh Rakhi festival greetings
Advertisement
  • పాదయాత్రలో ప్రతి ఊరిలో అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టారన్న లోకేశ్
  • మహిళలంతా హారతులతో నీరాజనాలు పట్టారని వ్యాఖ్య
  • సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్న లోకేశ్
Advertisement
రాఖీ పండుగను పురస్కరించుకుని టీడీపీ యువనేత నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. సొంత అక్కాచెల్లెళ్లు లేని తనకు ల‌క్ష‌లాది మంది తోబుట్టువుల‌ను దేవుడిచ్చాడని లోకేశ్ అన్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర సంద‌ర్భంగా ప్ర‌తీ ఊరిలోనూ తన అక్కాచెల్లెళ్లు రాఖీలు క‌ట్టారని చెప్పారు. అవ్వ‌, అమ్మ‌లంతా తాను చ‌ల్ల‌గా ఉండాల‌ని ఆశీస్సులు అందించారన్నారు. తన ఆయురారోగ్యాల కోసం మ‌హిళ‌లంతా హార‌తుల‌తో నీరాజ‌నాలు ప‌ట్టారని చెప్పారు. మీ అంద‌రి ప్రేమాభిమాన ఆప్యాయ‌త‌లు పొందుతున్న తాను ఎంతో అదృష్ట‌వంతుడినని అన్నారు. ఆడ‌ప‌డుచుల‌కి అన్న ఎన్టీఆర్ ఆస్తిహ‌క్కు క‌ల్పించారని తెలిపారు. మ‌హిళ‌ల‌ను మ‌హాశ‌క్తిగా చంద్రన్న తీర్చిదిద్దారని చెప్పారు. తెలుగుదేశం మార్గ‌ద‌ర్శ‌కుల‌ బాట‌లోనే మీ ర‌క్ష‌ణ, శ్రేయ‌స్సు కోసం కృషి చేయ‌డం తన బాధ్య‌త‌ అని అన్నారు. సోద‌రీమ‌ణులంద‌రికీ రాఖీ పండ‌ుగ శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నానని చెప్పారు.
Advertisement
Advertisement
Nara Lokesh
Telugudesam
Rakhi

More Telugu News